APSRTC పాడేరులో భారీగా గేట్ మీటింగ్, నిరసన

APSRTC పాడేరు డిపో గ్యారేజ్ అసిస్టెంట్ మెకానికల్ ఫొర్మెన్ (AMF) గ్యారేజ్ ఉద్యోగుల పట్ల, డ్రైవర్ల పట్ల, ఆన్ కాల్ డ్రైవర్ పట్ల, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల, అసోషియేషన్ నాయకుల పట్ల అహంకార పూరితంగా, అవమానకర, కక్ష్య పూరిత, వివక్ష పూరితమైన విధానాన్ని ఖండిస్తూ పాడేరు డిపో ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి సాగిన పరమేష్ ఆధ్వర్యంలో భారీగా గేట్ మీటింగ్ పెట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు.



ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మాటాడుతూ.. ఉద్యోగులను కించపరుస్తూ, అవమానపరుస్తూ, బయపెడుతూ, బ్లాక్ మెయిల్ చేసే విధానాన్ని విడనాడకపోతే దశల వారి ఆందోళనలు తీవ్రతారం చేస్తామని హెచ్చరించారు. అధికారం ఉందన్నా అహంభవంతో, తోటి ఉద్యోగుల పట్ల వివక్ష, కక్ష్య, ఏకపక్ష్య నిర్ణయాలు రేపటి నుండి పునరావృతం అయితే తదుపరి జరిగే తీవ్ర పరిణామలకు దశలవారి ఆందోళనలకు AMF గారే భాద్యత వహించాల్సి ఉంటుందని, గతంలో ఆన్ డ్యూటీ లో ఉంటూ ప్రమాదవసత్తు వేలు చితికిపోయిన G. ప్రశాంత్ అసిస్టెంట్ మెకనిక్ ని మీ నిర్లక్ష్యం కారణంగా సుమారు 45 రోజులు పైగా జీతం కోల్పోవల్సి వచ్చిందని ఇప్పటికైనా మానవతా దృక్పధంతో సంబంధిత రిపోర్ట్ తయారుచేసి అతనికి జీతం వచ్చేలా న్యాయం చెయ్యాలని సూచించారు. తోటి ఉద్యోగుల పట్ల గౌరవమైన, మర్యాదపూర్వకమైన, భాద్యతయుతమైన ధోరణి అవలంభించాలని, లైన్లో ఏదైనా ఆర్జీతో బస్సు ఆగి మీకు తెలియజేసిన యెడల చాల జూగుస్సుకారంగా, అవమనకరంగా, అహంకారపూరితంగా మాటాడే విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. అలాగే డిపో గ్యారేజ్ వ్యవస్థలో నూతనంగా ప్రవేశపెట్టిన సమయపాలన అనేది మన్యం, మైదాన, ఆరోగ్య ఆసరా, ప్రాంత, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీస్కొని పాత సమయపాలన సిస్టమ్ ని కొనసాగించాలని డిపో మేనేజర్ వారికి విన్నవించటం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం లో జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు, చిన్నరావు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.