విఎంఆర్డిఎలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-సిఐటియు డిమాండ్
విఎంఆర్ ఏ పరిధి పార్కుల్లో పనిచేస్తున్న గార్డెన్ తోటమాలి కార్మికులను అన్యాయంగా 18 మందిని తొలగించారు. వీరిని తొలగించి ఏడాది గడుస్తున్నా విధుల్లోకి తీసుకోకపోవడాన్ని ఉడా ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి. కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. విఎంఆర్డిఎ కమీషనరు, చైర్మెన్ ప్రణవ్ గోపాల్, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు, జిల్లా కలెక్టర్కు మూడు దఫాలు వినతిపత్రాలు అందజేసినా ఇంతవరకు న్యాయం చేయలేదు. తక్షణమే వీరిని పనిలో పెట్టుకొని కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
నేడు జిల్లా కలెక్టర్కు విన తిపత్రం అందజేసి కార్మికుల తమ కష్టాన్ని చెప్పుకున్నారు. వివిధ పార్కుల్లో పనిచేస్తున్న తోటమాలిగా ఉన్న 250 మంది కార్మికులకు కార్మిక చట్టాలు వర్తింపజేయాలని డిమాండ్ చేసారు. 35 సంవత్సరాలుగా పనిచేస్తున్న 18 మంది కార్మికులను ఎటువంటి నోటీన్ ఇవ్వకుండా తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 11మంది కార్మికులను 60 సం॥లు నిండిన కారణంగా తొలగించామని, మరో 7గురు వరునుగా 10రోజులు శెలవులు పెట్టారన్న కారణంతో కార్మికులకు తొలగించామని చెప్పడం సిగ్గుచేటు. ఇందులో పనిచేసే కార్మికులకు కనీసవేతనాలు, ఇఎస్ఐ, పిఎఫ్, రిట్రెస్మెంట్, గ్రాడ్యువిటీలు ఏవీ అమలు చేయడానికి మాత్రం చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. వీరిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న డిఎఫ్. ఓ అధికారిపైన, క్రింది స్థాయి అధికారులు పై చర్యలు తీసుకోవాలని కోరారు.
