విశాఖపట్నం: 24/12/25 తేదీన నేషనల్ కంజూమర్ డే సందర్భంగా విశాఖపట్నం సింధూర గెస్ట్ హౌస్‌లో కంజూమర్ డే వేడుకలను నేషనల్ వైస్ చైర్మన్ డా. డాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
అనంతరం జరిగిన సమావేశంలో డా. దాడి సత్యనారాయణ మాట్లాడుతూ... ప్రతి మనిషికి, కుటుంబానికి కంజూమర్ రైట్స్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందని, మనం ఎన్నో వస్తువులు కొంటూ ఉన్నాము, కానీ వాటిలో నాణ్యత లోపించడం, కొన్ని చోట్ల MRP రేట్ కంటే ఎక్కువ రేటుకు అమ్మడం జరుగుతోందని, ఇలాంటి మోసాలకు గురైన వినియోగదారులు కంజూమర్ కోర్టును ఆశ్రయిస్తే, ఎటువంటి ఖర్చు లేకుండా మీకు జరిగిన నష్టాన్ని, చెల్లించిన సొమ్మును తిరిగి పొందవచ్చు అని, మీకు ఏమైనా అన్యాయం గానీ మోసాలు గానీ జరిగుంటే ఈ నంబర్ కి సంప్రదించండి 9848311566 అని తెలియజేశారు.
అనంతరం నేషనల్ మెడికల్ ఛైర్మన్ పి .ప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ కు గాని ఫార్మసీ ద్వారా కానీ ఏ విధమైన అన్యాయం (మోసం) జరిగిన మా దృష్టికి తీసుకువచ్చినచో NCRC ద్వారా మీకు ఉచితంగా న్యాయం అందించడానికే ఈ సంస్థ పని చేస్తుంది అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డా॥ సుబ్రహ్మణ్యం (కార్డియాలజిస్ట్), ప్రముఖ న్యాయవాదులు రాజారావు, జీవన్, యువజన నాయకులు స్వరూప్, ముస్లిం యువజన నాయకులు అమీర్, యువజన నాయకులు దాడి లక్ష్మణ్ కుమార్, వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సమావేశంలో స్థానిక ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మహిళలకు, పురుషులకు వస్త్రాలు పంపిణీ చేస్తూ, అతిథులను పూలమాలలు మరియు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

