విశాఖ ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కు ప్రశంస...


విశాఖపట్నంలో ఇప్పటివరకు రోజుకు దాదాపుగా 2.5 లక్షల ప్రయాణీకులు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపద్యంలో మహిళలకు రూ.100 కోట్ల ఉచిత మొత్తాన్ని సాధించినందుకు ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశాఖ రీజినల్ మేనేజర్ ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ హరిందీరప్రసాద్ చేతుల మీదుగా  ప్రశంస పత్రం అందుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికం అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ పట్టణ మున్సిపల్ కమిషనర్ మరియు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.