కమోడోర్‌ గిరిదీప్‌ సింగ్‌ స్థానంలో కెప్టెన్‌ వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ

విశాఖపట్నం, : హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ చైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ (అదనపు బాధ్యత)గా ఆరు నెలల పాటు సేవలందించిన కమోడోర్‌ గిరిదీప్‌ సింగ్‌ (రిటైర్డ్‌) శనివారం పదవీ విరమణ చేశారు. 



ఆయన స్థానంలో నూతనంగా డైరెక్టర్‌ (షిప్‌బిల్డింగ్‌)గా ఉన్న కెప్టెన్‌ గంటి వెంకటేశ్వర్లు (రిటైర్డ్‌) అదేరోజు షిప్ యార్డ్ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2022 మార్చి 5 నుంచి డైరెక్టర్‌ (స్ట్రాటజిక్‌ ప్రాజెక్ట్స్‌)గా బాధ్యతలు నిర్వర్తిస్తూ సబ్‌మరీన్‌, షిప్‌ రిపేర్‌ విభాగాలను ఆయన పర్యవేక్షించిన,  ఆయన పదవీకాలంలో ఐఎన్ఎస్. సిధుకీర్తి నార్మల్‌ రీఫిట్‌, ఎస్ఎస్పి వంటి కీలక ప్రాజెక్టులు పూర్తికాగా, డిఎస్వి , ఎఫ్ఎఫ్ఎస్. కార్యక్రమాలు విజయవంతంగా జరౄడానికి సారధ్యం వహించారు.‌ఈ కాలంలోనే సుమారు రూ.3,000 కోట్ల విలువైన కోస్ట్‌ గార్డ్‌ 18 ఎన్జిఎఫ్పివీస్ ప్రాజెక్టులో షిప్ యార్డ్ మొదటి స్థానంలో నిలిచింది. కమోడోర్‌ గిరిదీప్‌ సింగ్‌ పదవీ విరమణ నేపథ్యంలో, డైరెక్టర్‌ (షిప్‌బిల్డింగ్‌)గా ఉన్న కెప్టెన్‌ గంటి వెంకటేశ్వర్లు (రిటైర్డ్‌) జనవరి 31, 2026 నుంచి HSL చైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2018 మేలో షిప్ యార్డ్ లో చేరగా, 2024 నవంబర్‌ 29న డైరెక్టర్‌ (షిప్‌బిల్డింగ్‌)గా బాధ్యతలు చేపట్టారు. నావల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, లోణావళా మరియు డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌, వెల్లింగ్టన్‌ పూర్వ విద్యార్థి అయిన కెప్టెన్‌ వెంకటేశ్వర్లు, భారత నౌకాదళంలో 25 సంవత్సరాలకు పైగా సేవలందించారు. షిప్ యార్డ్ లో షిప్‌బిల్డింగ్‌, సబ్‌మరీన్‌, షిప్‌ రిపేర్‌ విభాగాల్లోతో పాటు బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ లో ఉన్న హోదాలో పనిచేశారు.