జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమమును తేది 31.01.2026 న APSRTC, మద్దిలపాలెం డిపో ఆవరణలో నిర్వహించినారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ హరేందిర ప్రసాదు IAS, ప్రత్యెక అతిధులు డిప్యుటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ R.Ch. శ్రీనివాస్ మరియు APSRTC జోనల్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీమతి జి. విజయ గీత, గౌరవ అతిది సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస సాయి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమమునకు జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భమును పురస్కరించుకొని ముఖ్య అతిధి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ హరేందిర ప్రసాదు మాట్లాడుతూ జిల్లా లో ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల విజయవంతం అగుటకు ఆర్టీసి వారి సేవా, సహకారాలను కోనియాడినారు, విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “అంతర్జాతీయ యోగ డే “ సందర్బంగా వివిధ జిల్లాల నుండి ప్రజలను రవాణా చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం తో పాటు గిన్నిస్ బుక్ రికార్డు సాదించుటలో ఆర్టిసి అధికారులు మరియు సిబ్బంది చేసిన కృషిని కొనియాడారు. అలాగే ఆగస్టు 15, 2025 నుండి ప్రభుత్వ ప్రవేశ పెట్టిన “ స్త్రీ శక్తి” పథకం అమలు చేయడంలో రాష్ట్రంలోనే విశాఖ జిల్లా ప్రధమ స్థానంలో ఉన్నదని, ఈ విషయంలో జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ని, ఆర్టిసి అధికారులను, సిబ్బందిని అభినందించారు. సిబ్బంది అందరూ వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వహిస్తూ విశాఖ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా నిలపాలని అభిలషించారు. ట్రాఫిక్ నియంత్రణలో కృత్రిమ మేధస్సును ఉపయోగించి సిగ్నలింగ్ వ్యవస్తను ఆధునీకరించి ప్రయాణ సమయాన్ని తగ్గించుటకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపినారు.
అలాగే ప్రత్యెక అతిధి డిప్యుటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ R.Ch. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపెటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని , ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ వాహనాలు నడపాలని కోరినారు.
జోనల్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీమతి జి. విజయ గీత మాట్లాడుతూ విశ్వంలో మొట్టమొదటి రధసారధి భగవానుడైన శ్రీకృష్ణుడు అని, మన డ్రైవర్లు ఆయనకు వారసులని, సంస్థలో డ్రైవర్ల పాత్ర ముఖ్యమైనదని తెలిపారు. బస్సులను అతి జాగ్రత్తతో, మెళకువతో నడపాలని, ప్రతీ బస్సులో ఉన్న కనీసం 50 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితముగా చేర్చే భాద్యత మీదేనని తెలిపినారు.
జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాల లో భాగంగా, ఆర్టీసి డ్రైవర్లతో పాటు అద్దె బస్సు డ్రైవర్లకు, ఆన్ కాల్ డ్రైవర్లకు కూడా డ్రైవింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, మెళకువలు తెలుపుతూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎపీఎస్ఆర్టీసి జాతీయ స్థాయిలో గుర్తిపు పొందుటలో సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమైనదని, ఇదే స్ఫూర్తి తో అందరూ విదులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరినారు. ఈ మాసోత్సవాలలో భాగంగా విధులలో ఉత్తమ ప్రతిభ కనబరచిన డ్రైవర్లను , మెకానిక్ లను, సూపర్వైజర్లను, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్త్రక్టర్లు కలిపి సుమారు 30 మందిని గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా దుస్సాలువ, ప్రశంసా పత్రాలు మరియు బహుమతులతో సత్కరించారు.
ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ హరేంద్ర ప్రసాదు IAS, డిప్యుటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ R.Ch. శ్రీనివాస్, APSRTC జోనల్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీమతి జి. విజయ గీత, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ సాయి, జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు, డిప్యుటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీమతి కె.పద్మావతి, డిప్యుటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ గంగాధర రావు , V&SO దుర్గాప్రసాద్, ద్వారకా బస్సు స్టేషన్ ATM ఎ. గంగాధర్, పర్సనల్ ఆఫీసర్ జె. తిరుపతి, డిపో మేనేజర్లు ఉమమేస్వర రెడ్డి, సుధాకర్, శరత్ బాబు, గౌతమ్ చటర్జీ శ్రీమతి మణిమాధురి, శ్రీమతి దుర్గ, సూపర్వైజర్లు, కార్మిక నాయకులు, అవార్డు గ్రహీతలు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు సిబ్బ్నది అందరూ పాల్గొన్నారు.



