గిరిజనేత్ర మహిళను తక్షణమే కాంటాక్ట్ లేబర్ పోస్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర మార్కురాజు దండకారణ్య విమోచన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కిల్లో మనోజ్ కుమార్.
ఏపీ జెన్కో సంస్థ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నందున ఎటువంటి ఉద్యోగాలైన స్థానికంగా ఉన్న ఆదివాసులకు కేటాయించకుండా గిరిజనేతర మహిళకి కాంటాక్ట్ లేబర్ పోస్ట్ కేటాయించడం చాలా దారుణమని తెలిపారు.
తక్షణమే ఆమెకు ఉద్యోగం నుండి తొలగించి స్థానికంగా ఉన్న ఆదివాసులకు ఈ యొక్క పోస్ట్ కేటాయిస్తారని, లేనియెడల ధర్నాలు మరియు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దండకారణ్య విమోచన సమితి సభ్యులు కిల్లో మంగరాజు, కామేష్, కృష్ణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

