అండర్ -15 నేషనల్ బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన దేవన్ సాయి
విశాఖపట్నం, (స్పోర్ట్స్): కేరళ రాష్ట్రం కొవ్వుర్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఇటీవల జరిగిన ఓపెన్ నేషనల్ కె–1 అమెచూర్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో విశాఖపట్నం జిల్లాకు చెందిన దేవన్ సాయి దొరై అండర్–15, 45 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.
దేశవ్యాప్తంగా సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో అతడు అద్భుత ప్రదర్శనతో జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. ఈ విజయం విశాఖ జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని షిప్ యార్డ్ ఉద్యోగి బాక్సింగ్ కోచ్ భీమా రావు తెలిపారు.

