హెచ్.పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ పై ఆకస్మిక తనిఖీ నిర్వర్తించిన జిల్లా జాయింట్ కలెక్టర్....

అమలాపురం మార్చి 20: ప్రస్తుత ఎల్పిజి వంట గ్యాస్ కొరత నేపద్యంలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, ప్రభుత్వ ఆదేశాలను తప్ప కుండా ఆచరిస్తూ గృహ నియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎక్కడ ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం కాకుండా ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని గ్యాస్ టైలర్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి ఆదేశించారు. 



శుక్ర వారం స్థానిక ప్రాంతీయాసుపత్రి సమీపంలోని శ్రీ రాజేశ్వరి హెచ్.పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏజెన్సీలోని స్టాక్ రికార్డులను డెలివరీ రికార్డులను పరిశీలించి డీలర్లకు సక్రమ సరఫరా పై పలుసూచనలు ఆదేశాలు జారీ చేశారు. గత 25 రోజులుగా గ్యాస్ జనరల్ బుకింగ్ డెలివరీ ప్రక్రియలను రికార్డు ఆధారంగా తనిఖీ చేశారు. పట్టణాల్లో 25 రోజులు గ్రామాలలో 30 రోజులు కాలవ్యవధిలలో సిలిండర్లు పానిక్ కృత్రిమ కొరతకు ఆస్కారం లేకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. బుకింగ్ ప్రక్రియకు అనుగుణంగా మాత్రమే గృహ వినియోగ దారులకు గ్యాస్ సరఫరా చేపట్టాలన్నారు. అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, జిల్లాలో ఎల్పిజి వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అ ప్రకారమే గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా గ్యాస్ సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డీలర్లను ఆదేశించారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గృహ వినియోగదారులకు గ్యాస్ డెలివరీలో ఆలస్యం జరగకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. అక్రమ నిల్వలు ఏర్పాటు చేయరాదని అదేవిధంగా గ్యాస్ కొరత ఉందనే సాకుతో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారదర్శకతతో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ప్రాధాన్యత క్రమంలో సిలిండర్లను పంపిణీ చేయాలన్నారు. పంపిణీ ప్రక్రియపై పౌరసరఫరాల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గ్యాస్ లభ్యతపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగినంత నిల్వలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె స్పష్టం చేశారు. 



జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేశ్వరి హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీపై నిర్వహించిన తనిఖీ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటం అత్యంత అవసరమన్నారు. గ్యాస్ సిలిండర్లను కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే సక్రమంగా సమయానికి అందించాలన్నారు. వాణిజ్య వినియోగానికి గృహ సిలిండర్లను మళ్లించడం పూర్తిగా నిషేధమన్నారు ఏజెన్సీలు పారదర్శకతతో పనిచేసి, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రజలు కూడా అవగాహనతో ఉండి, ఎలాంటి అక్రమాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగు తుందన్నారు, ప్రభుత్వ సూచనలు కేంద్రం ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్‌ను అమలు చేసి, గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించిందన్నారు. పానిక్ బుకింగ్‌ను నివారించి ఆన్‌లైన్ బుక్ చేయాలన్నారు మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ పౌరసరఫరాల అధికారి శరత్, తాసిల్దార్ దివాకర్, సిఎస్డిటి భారతి, తూనికలు కొలతలు కంట్రోలింగ్ అధికారి రామయ్య తదితరులు పాల్గొన్నారు.