అతి తక్కువ కాలం లో కూటమి ప్రభుత్వనికి ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత.....
వైసీపీని క్షేత్రస్థాయి భలోపేతం చేద్దాం అని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి అన్నారు.
ఈ రోజు సీతమ్మధార విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో విశాఖ తూర్పు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశం లో రమణికుమారి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వ నికి ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఇచ్చిన హామీలు అమలు చేయలేక వైసీపీ నేతలు పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు అన్నారు. వై యస్ జగన్మోహన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందేనని అలాగే 2029లో వైఎస్ఆర్సిపి అధికారంలో వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు పూర్తిస్థాయిలో మేలు చేయనున్నారని తెలిపారు ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి వైసీపీ విధివిధానాలను కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలన్నారు పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయంచేస్తామన్నారు. వార్డు&సచివాలయం పార్టీ కమిటీలు త్వరగతిన పూర్తిచేసి, వార్డు సచివాలయం స్థాయిలో ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పేర్ల విజయచందర్, సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి అల్లంపల్లి రాజబాబు,రాష్ట్ర బిసి విభాగం ఉపాధ్యక్షులు కంట్రెడ్డి రామన్నపాత్రుడు, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి సత్తి మందారెడ్డి,జిల్లా ఇంటలేక్చువల్ విభాగం అధ్యక్షుడు దేవరకొండ మార్కండేయులు, తూర్పు మహిళ అధ్యక్షురాలు కె.శిరీష, పీతల మహేష్, గూడపాటి విక్టర్, వానపల్లి ఈశ్వరరావు, కాళిదాసు రెడ్డి, గొలగాని లక్ష్మీ, పీతల గోవింద్, బోండా ఉమామహేశ్వరరావు, సత్యాల సాగరిక, వనం వరలక్ష్మి, మెట్ట సూర్యనారాయణ, ఇమంది సత్యనారాయణ, సంపంగి సురేష్, వాసుపల్లి యల్లాజీ, మొల్లి హేమంత్, సత్యాల వెంకట్, కణితి మరియదాసు,చొల్లంగి నాగేశ్వరరావు, పలికిల నీలారెడ్డి, ఉమ్మిడి కళ్యాణ్, సూరాడ వెంకటలక్ష్మి, యనమరెడ్డి కుమార్ రెడ్డి, మదుపాడ రవి, బూస రమణారెడ్డి, సుబ్రమణ్యం, నగిరెడ్ల పోలిశెట్టి, కిముడు భాస్కర్, శ్రీనివాస్ పాత్రో, వేణుగోపాల్, మొల్లి వెంకటరమణ, బోర కుమార్ రెడ్డి, పరదేశి, కనకాల కృష్ణ, మధుసూదనరెడ్డి, పిల్లా సత్యవతి, పోలరత్నం, విమల, అప్పలకొండమ్మ, వసంత, సంధ్య, కుసుమ,సత్యవాణి, జ్యోతి, సంయుక్త, జగదీశ్వరి, శశికళ, వెంకటలక్ష్మి, జానకి, పర్వీన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
