తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు తరలిరండి...

వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలకు, కొత్తపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు ఎమ్మెల్సీ రాజశేఖర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.



కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు తరలిరావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు ఎమ్మెల్సీ పెరభాత్తుల రాజశేఖర్ ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆహ్వానించారు. విజయవాడ మినిస్టర్ కార్యాలయంలో మంత్రిని కలుసుకుని స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక, ప్రసాదం అందజేశారు. అలాగే ఈనెల 31వ తేదీన జరగనున్న కొత్తపేట మార్కెట్ కమిటీ స్వీకార కార్యక్రమానికి సైతం తరలిరావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణంతో కళ్యాణోత్సవాలు మొదలవుతాయని, ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు కళ్యాణోత్సవాలు జరగనున్నాయని ఎమ్మెల్యే బండారు వివరించారు. కళ్యాణోత్సవానికి తరలి వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు.