విజయవంతంగా హోటల్ శుభ గృహాలో క్షేత్రస్థాయి ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం..




డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మార్చి 26:  గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాక్షరతను పెంచడంలో క్షేత్రస్థాయి ఆర్థిక అక్షరా స్యత అవగాహన కార్య క్రమం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆర్‌బిఐ మేనేజర్లు ఎ. రామకృష్ణ, సి. నవీన్ కుమార్ లు అన్నారు.



గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రాంతీ య కార్యాలయం వారు స్థానిక పట్టణంలోని హోటల్ శుభ గృహాలో క్షేత్రస్థాయి ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆర్‌బిఐ మేనేజర్లు స్వయం సహాయక బృందాల సభ్యులు, మహిళా పారిశ్రామికవేత్తలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులతో సమావేశమై, అంబుడ్స్‌మన్ పథకం, కేవైసీ , క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బ్యాంకు నోట్ల భద్రతా లక్షణాలు, ఆర్‌బిఐ విధులు, బీమా పథకాలు, డిఐసిజిసి మొదలైన అంశాల గురించి స్పష్టమైన అవగాహనను కల్పించారు ఆర్థిక అవగాహన మరియు చేరిక దిశగా ఆర్‌బిఐ చేపట్టిన కార్యక్రమాలను పరిచయం చేసి, పాల్గొన్న వారి సందేహాలను నివృత్తి చేస్తూ స్పష్టమైన సమాధా నాలు అందించారు. సామాన్య ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలపై అవగాహన కల్పించడం, పొదుపు మరియు ప్రణాళిక భవిష్యత్తు అవసరాల కోసం పిల్లల చదువు, వివాహం, వైద్యం ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయాలన్నారు. ఆడంబరాలకు పోకుండా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆర్బిఐ సూచిస్తుందన్నారు భద్రత నగదు రహిత డిజిటల్ లావా దేవీలు, మొబైల్ బ్యాంకింగ్, మరియు డెబిట్ కార్డుల వినియోగా న్ని ప్రోత్సహించాలన్నారు. PIN, OTP, CVV లేదా బ్యాంక్ పాస్‌వర్డ్‌లను ఎవరికీ బ్యాంక్ అధికా రులమని చెప్పేవారికి కూడా తెలియజేయకూ డదన్నారు అనుమానా స్పద ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లలో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దన్నారు. వడ్డీ వ్యాపారుల దగ్గర కాకుండా, బ్యాంకులు లేదా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల నుండి మాత్రమే రుణాలు తీసుకోవాల న్నారు తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడం ద్వారా సిబిల్ స్కోర్ మెరుగుపడుతుందన్నారు దీనివల్ల భవిష్యత్తులో సులభంగా రుణాలు లభిస్తాయన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ,ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి తక్కువ ప్రీమియం పథకాలపై అవగాహన ఉండాల న్నారు.అటల్ పెన్షన్ యోజన ద్వారా వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా పొందాలన్నారు.బ్యాంకు సేవల్లో ఏవైనా లోపాలు ఉంటే లేదా మోసపోయి నట్లయితే, మొదట సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలన్నారు. 30 రోజుల్లో పరిష్కారం లభించకపోతే, RBI ఒంబుడ్స్‌మన్ కి ఫిర్యాదు చేసే హక్కు వినియోగదా రులకు ఉంటుందన్నారు. మీ డబ్బును రెట్టింపు చేస్తామనే నకిలీ స్కీమ్‌ లను నమ్మవద్దన్నారు ఎల్లప్పుడూ రిజర్వ్ బ్యాంక్ గుర్తింపు పొందిన సంస్థ లలోనే పెట్టుబడి పెట్టాల న్నారు. ఈ అవగాహన కార్యక్రమం ఆర్థిక సాక్షరత పెంపులో మైలురాయిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డిఎం కేశవ వర్మ, పిడి మెప్మా పెంచాలయ, డిఆర్‌డిఎ డిపిఎం అన్నపూర్ణ, జిఎం డిఐసి అరుణ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), కెనరా బ్యాంక్, భారతీయ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.