అక్రిడిటేషన్ గుర్తింపు కార్డుల పంపిణీ...



అమలాపురం మార్చి 26: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2026- 2027 రెండు సంవత్సరాలకు కాల పరిమితికి సంబంధించి అక్రిడిటేషన్ గుర్తింపు కార్డులను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్థానిక కలెక్టరేట్ నందు పంపిణీ చేశారు. 



అక్రిడిటేషన్ కార్డులు పొందిన వారిలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ వెంకట్, ఆంధ్రప్రభ స్టాప్ రిపోర్టర్ ఎం ఎన్ వి ప్రసాద్, వార్త దినపత్రిక రిపోర్టర్ సుంకర ప్రసాద్, మహా టీవీ రిపోర్టర్ రంకిరెడ్డి కృష్ణ, టీవీ9 రిపోర్టర్ మాకా వెంకటేశ్వరరావు, ఐ న్యూస్ రిపోర్టర్ జీవీఎస్ఎస్ ప్రసాద్ కమిటీ కన్వీనర్ చేబ్రోలు శ్రీనివాస్ ఉన్నారు.