మోదీ నాయకత్వం గాండ్ల తెలీ వర్గానికి గర్వకారణం: డాక్టర్ దాడి సత్యనారాయణ

జగదాంబ వద్ద ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు

​కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసిన నేతలు



​విశాఖపట్నం: భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ గాండ్ల తెలీ వర్గంలో జన్మించడం దేశవ్యాప్తంగా ఉన్న సమాజ ప్రజలందరికీ గర్వకారణమని విశాఖ జిల్లా అఖిల గాండ్ల తెలీకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ దాడి సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని జగదాంబ వద్ద గల సంఘ కార్యాలయంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.



​ఈ సందర్భంగా డాక్టర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ.. గుజరాత్‌లోని ఒక సామాన్య, వెనుకబడిన కుటుంబంలో పుట్టి, ఎన్నో ఆర్థిక అవరోధాలను దాటుకుని స్వయంకృషితో మోదీ ప్రపంచం మెచ్చే నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. భవిష్యత్తు ఎన్నికల్లోనూ విజయం సాధించి, ఆయన నాలుగోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం నేతలు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.



​కార్యక్రమంలో సంఘ కన్వీనర్ ఎన్నేటి తాతారావు, ప్రధాన కార్యదర్శి చిత్రాడ అప్పారావు, కోశాధికారి ఎన్నేటి సన్యాసిరావు, యూత్ అధ్యక్షుడు దాడి లక్ష్మణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిత్రాడ వెంకటరమణ, ప్రచార కార్యదర్శి అయినవిల్లి సన్నిబాబు, నేతలు ఎన్నేటి గోవిందరావు, గండేపల్లి గోవిందరాజులు, ఎన్నేటి రమణ తదితరులు పాల్గొన్నారు.