ఆదోనిలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వి. రమేష్ నాయుడుకు ఘన సన్మానం

ఆదోని, సెప్టెంబర్ 10: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న వి. రమేష్ నాయుడును భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆదోని మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.



ఈ సందర్భంగా నెహ్రూ మెమోరియల్ స్కూల్ (NMMHS) ప్రధానోపాధ్యాయులు రమేష్ నాయుడుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వకారణమని కొనియాడారు.



కార్యక్రమంలో సీపీఐ ఆదోని మండల కార్యదర్శి కల్లుబావి రాజు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, ఏఐటీయూసీ అధ్యక్షుడు ఓ.బి. నాగరాజ్, కార్యదర్శి వై.టి. భీమేష్, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు షేక్ షావలి తదితరులు పాల్గొని రమేష్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.



అలాగే నెహ్రూ మెమోరియల్ స్కూల్ ఉపాధ్యాయులు సైతం కార్యక్రమంలో పాల్గొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన వి. రమేష్ నాయుడును అభినందించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.