కోసిగిలో ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ 17వ వర్ధంతి

కోసిగి (న్యూస్ రిపోర్టర్ రాముడు): కోసిగి మండల కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, యువనేత వై. ధరణీ రెడ్డి ఆదేశాల మేరకు, మండల ఇన్‌చార్జ్ మురళీమోహన్ రెడ్డి సమన్వయంతో నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.



​ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజు మరియు ఇతర ముఖ్య నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ఈ సందర్భంగా పలువురు వక్తలు పేర్కొన్నారు.



​ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు మరియు వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.