తిరుచానూరులో ఘనంగా శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భక్తులకు, ప్రజలకు విశేషంగా అన్నదానం
తిరుచానూరు (ప్రత్యేక ప్రతినిధి): జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుచానూరులో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంకట్ రాయల్ ఆధ్వర్యంలో బుధవారం తిరుచానూరు ఆలయ గేటు సమీపంలో భక్తులకు, స్థానిక ప్రజలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకట్ రాయల్ మాట్లాడుతూ... "ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్న జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది" అని తెలిపారు. ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులు, స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు బండ్ల లక్ష్మీపతి, తపసి మురళి రెడ్డి, చంద్రమౌళి, ప్రతాప్ రెడ్డి, యుగంధర్, సమర, దండు లక్ష్మీపతి, బీజేపీ నాయకురాలు పుష్పతో పాటు జనసైనికులు, వీర మహిళలు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


