వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన శాంతకుమారి

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఏపీ కాంగ్రెస్ నాయకురాలు పాచిపెంట శాంతకుమారి



అరకు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పేదల నిధి, ప్రజాహృదయ నేత late డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను ఏపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో అరకులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ శ్రేణులు నివాళులర్పించాయి.



అనంతరం శాంతకుమారి మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ పథకాలు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడాయని కొనియాడారు. గిరిజన పిల్లలకు విద్యను చేరువ చేయడంతో పాటు ఉన్నత విద్య కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి గొప్ప పథకాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న మౌలిక సమస్యలైన తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, ఉపాధి అవకాశాలను వెంటనే పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 5వ షెడ్యూల్ ప్రాంతాల ప్రత్యేక హక్కులు, PESA చట్టం, 1/70 చట్టం వంటి రాజ్యాంగ పరిరక్షణల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆశయ సాధనకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.