చట్ట పరిధిలో బాధితులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం

ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, లిప్స్



​రాజమహేంద్రవరం (జిల్లా పోలీస్ కార్యాలయం): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)" కార్యక్రమాన్ని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్., గారు స్వయంగా పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.



​బాధితుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న ఎస్పీ గారు, తక్షణమే సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చట్ట పరిధిలో బాధితులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐ.పి.ఎస్., గారు పలు పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

​ఈనాటి PGRS ముఖ్య అంశాలు:

​మొత్తం వచ్చిన ఫిర్యాదులు: 18

​ఫిర్యాదుల స్వరూపం: సివిల్ తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ (మోసపూరిత) కేసులు మరియు ఇతర సమస్యలు.

​ముఖ్య ఆదేశం: అర్జీదారుల ఫిర్యాదులపై నిర్దేశిత గడువులోగా సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలి.

​జారీ చేయబడినది: పోలీస్ పి.ఆర్.ఓ (PRO), తూర్పుగోదావరి జిల్లా.