పోలీసుల అదుపులో యూట్యూబర్ నందన: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్!

యూట్యూబర్ నందనను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నందన దంపతులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.



​ఆమెపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయి ఉండటంతో, విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన నందనను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో RGIA పోలీసులు ఆమెను తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు.