తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి... నెల కిందట కేజీ రూ.30-50 ఉండగా,, ప్రస్తుతం రూ.70-80కి చేరింది.. తెల్ల ఉల్లి ధర ఏకంగా రూ.100 దాటిపోయింది.. హైదరాబాద్ మలక్ పేట హోల్సేల్ మార్కెట్లో క్వింటా ఉల్లి రూ.4,500 నుంచి రూ.5,200 వరకు పలుకుతోంది...ఎల్ నినో ప్రభావంతో మహారాష్ట్ర,, కర్ణాటకలో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం.. లోకల్ పంట వచ్చే వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు......

