డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మార్చి 31: దేశ భవిష్యత్తును తీర్చిది ద్దాల్సిన యువత మాదక ద్రవ్యాల వ్యసనాల బారిన పడి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసు కోవద్దని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వ హించి తీసుకోవలసిన చర్యల పట్ల వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కోనసీమ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా రూపొదించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం వహించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు జోలికి వెళ్ళితే భవిష్యత్తు అంధకారమవుతుందనే సందేశాన్ని యువతకు విస్తృత స్థాయిలో చేర్చాలన్నారు. యువతలో అవగాహన కలిగించి, యువత మాదక ద్రవ్యాలు జోలికి పోకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పిల్లలు డ్రగ్స్ మత్తు పదార్థాలు అలవాటు కాకుండా గట్టిగా దృష్టి పెట్టాలన్నారు. మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందని, నడవడిక ఏ విధంగా ఉందనే విషయాలు ఎప్పటి కప్పుడు పరిశీలించుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.
మాదక ద్రవ్యాల రహిత సమాజం దిశగా యువతీ యువకులకు నేటి సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. ఇది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాకుండా, కుటుంబాలను మొత్తం సామాజిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ఒక పెను సవాలుగా ఉందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన యువత ఈ వ్యసనాల బారిన పడి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ మహమ్మారిని నిరోధించేక్రమంలో జిల్లా యంత్రాంగం అవగాహన మరియు చైతన్యం విద్యాసంస్థల్లో నిఘా పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మాదక ద్రవ్యాల అమ్మకాలను అరికట్టడానికి పోలీసు ఎక్సైజ్ శాఖల ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి విద్యాసంస్థలో యాంటీ డ్రగ్ క్లబ్స్ఏర్పాటు చేసి, విద్యార్థుల ద్వారానే తోటి వారిలో చైతన్యం కల్పించే కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. నిఘా మరియు నియంత్రణ మాదక ద్రవ్యాల రవాణా, నిల్వ మరియు విక్రయాలకు పాల్పడే వారిపై చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్లో వద్ద సౌరశక్తి లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ప్రవేశించే వాహనాలలో తనిఖీలు నిర్వహించి గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే లేదా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా జిల్లా హెల్ప్ లైన్ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.వ్యసనానికి గురైన వారిని నేరస్థులుగా చూడకుండా, బాధితులుగా గుర్తించి వారిని మార్చడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ కొరకు పునరావాస కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రసంగిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ మానసిక ధైర్యాన్ని అందించాలన్నారు.క్షణికానందం కోసం డ్రగ్స్ వైపు వెళ్లడం అంటే మృత్యువు ను ఆహ్వానించడమేన న్నారు కష్టపడి చదవండి, క్రీడల్లో రాణించండి మరియు సృజనాత్మక పనుల్లో నిమగ్నం అవ్వండి. మీ కలలే మీ గమ్యం కావాలి తప్ప, వ్యసనాలు కాదన్నారు. మనమందరం కలిసికట్టు గా పోరాడి, మన జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లా గా తీర్చిదిద్దాలన్నారు. మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలను డిగ్రీ మారక ద్రవ్యాలు రవాణా చేసిన విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఓటీపీలు, లింక్స్, లోన్ యాప్లు, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులు, ద్వారా సెల్లర్ నేరాలు, చదువుకో వలసిన వయసులోప్రేమ పేరుతో ఫోక్స్ చట్టం అతిక్రమించి నేరాలకు యువత బలవుతున్నారని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చట్టాలపై అవగాహన కల్పించారన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకొని సన్మార్గంలో నదిచినప్పుడు మాత్రమే నేటి యువత భవిష్యత్తులో మంచి పౌరులుగా వెలుగొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు మమ్మీ భాగ్యవతి, డిపిఓ శాంత లక్ష్మి, ఆర్టీవో డి శ్రీనివాసరావు, డి సి హెచ్ ఎస్ కార్తీక్, డిఎం అండ్ హెచ్ ఓ దుర్గారావు దొర, ఆర్టీసీ జనరల్ మేనేజర్ డిఎల్ఎన్ శర్మ తదితరులు పాల్గొన్నారు





