జగన్ మోహన్ రెడ్డి ని చూస్తే మీకు ఎందుకు అంత భయం...

పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్టు ఉంది కొత్తగా చేసిన రాజధాని తీర్మానం..రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం పెద్ద స్కాం చేస్తుంది...పాత రైతులకు న్యాయం చెయ్యకుండా కొత్త రైతులను ఏ రకంగా దగా చేస్తారు చంద్రబాబు...మీరు అన్న కేవలం పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ని చూస్తే మీకు ఎందుకు అంత భయం... బండారు టాక్స్ పేరుతో బండారు సత్యానంద రావు కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారు...డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి.



ఈ రోజు రావులపాలెం వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని విషయంలో తీర్మానం చేసిన తీరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ పెళ్లి చూపులు చేసినట్టు ఉందని ఆయన అన్నారు. రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ చేస్తుందని అలాగే పాత రైతులకు న్యాయం చేయకుండా కొత్త రైతులను బాగా చేయడానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా అమరావతిని రాజధానిగా తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేలు అందరూ అంటున్న కేవలం పులివెందుల ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే అయిన జగన్ మోహన్ రెడ్డి ని చూసి మీరు అందరూ ఎందుకు అంత భయపడుతున్నారని అన్నారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానంద రావు మరియు అతని తమ్ముడు బండారు శ్రీనివాస్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లిక్కర్ మరియు మట్టి ఇసుక మాఫియా వంటివి కలిసి చేసుకుంటూ అవినీతిమయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానన్న చంద్రబాబు నాయుడు మీరు బెల్ట్ ఎప్పుడు తీస్తారో చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.