ISO గుర్తింపు సాధించిన రావులపాలెం పంచాయతీకి అభినందనలు.. సర్పంచ్ నాగమణి, ఉప సర్పంచ్ మునిరెడ్డికి సన్మానం..
ISO గుర్తింపు సాధించిన రావులపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి పూలదండలు వేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత, అభివృద్ధి, పారదర్శక పాలనలో ఉన్నత ప్రమాణాలు పాటించడం వల్లే ISO గుర్తింపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
