తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ...

తెలుగు జాతి ఉన్నంతవరకూ తెదేపా ప్రస్థానం కొనసాగుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ మంత్రి నారా లోకేష్ ల సారథ్యంలో ప్రజాసేవే పరమావధిగా ముందడుగు...తెదేపా 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు....



తెలుగు జాతి ఉన్నంతవరకు తెదేపా ప్రస్థానం కొనసాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే, ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా యువ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, వారిరువురి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సాహంతో ముందడుగు వేస్తుందన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. 



ముందుగా వాడపాలెం సెంటర్ లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.తరువాత కొత్తపేట బస్టాండ్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం *రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకుని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆకుల రామకృష్ణ, యువనాయకులు బండారు సంజీవ్ మరియు తెలుగుదేశం నాయకులతో కలిసి టిడిపి జెండా ఆవిష్కరించారు.అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 



టిడిపి ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఆడియో, వీడియో ప్రదర్శన వీక్షించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవం దశదిశలా వ్యాప్తి చేయడమే లక్ష్యంగా 1982లో ఇదే రోజున అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే బండారు అన్నారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని ప్రజలకు సేవ చేయడమేనని అన్న ఎన్టీఆర్ చాటారని, దేశ రాజకీయాల్లో సంక్షేమ పాలన, సుపరిపాలనకి మార్గం వేసారని బండారు అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లేలా ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు.నాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతే లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో తెలుగుదేశం కట్టుబడి ఉందన్నారు.



ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చేస్తున్నారన్నారు. దళిత, బహుజన వర్గాల నాయకులకు ఉన్నత పదవులను ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని చాటారని, సైబరాబాద్ నిర్మాణం పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో నిలిపారని, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పునాదులు వేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అహరహం శ్రమిస్తున్నారని, ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించే విధంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. యువ నాయకులు నారా లోకేష్ తెలుగుదేశం కార్యకర్తలకు సొంత అన్నలా చేదోడుగా నిలుస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారని కొనియాడారు. ఇక పార్టీ పరంగా చిన్న, చిన్న లోటుపాట్లు ఉంటే అందరం కలిసి మెలిసి వాటిని సరిదిద్దుకుందామన్నారు. మనం చేసే పని ఏదైనా పార్టీ గౌరవం, నాయకుని గౌరవం పెంచే విధంగా పాటుపడదామన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు,నాయకులతో కలిసి టీడీపీ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కోసం అత్యుత్తమ పనితీరును కనబరిచిన నాయకులను, కార్యకర్తలను సన్మానించారు. తదుపరి భారీ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలను కార్యకర్తలకు అందజేశారు. అనంతరం వారందరితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు స్వయంగా నాయకులకు, కార్యకర్తలకు భోజనం వడ్డించారు.