ఆదోనిలో 41వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ చైర్మన్ టిడిపి యువ నాయకులు మారుతి నాయుడు గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం
ఆదోని, అక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి 41వ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ చైర్మన్ మారుతి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు, పీఈటీ ఉపాధ్యాయులు, అథ్లెటిక్స్ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవ రెడ్డి, ఆదోని డీఎస్పీ వెంకటరమణ, ఆదోని ఆర్డీవో శ్రీమతి అరుణాదేవి, ఆదోని టీడీపీ సీనియర్ నాయకులు భూపాల్ చౌదరి, మారుతి నాయుడు, నేషనల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆకుల రాఘవేంద్ర, స్టేట్ సెక్రటరీ హర్షవర్ధన్, మాజీ కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి హర్షవర్ధన్, ఆర్ట్స్ కళాశాల కరస్పాండెంట్ దైవదీనం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి, వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులతో మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం 41వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదోని పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిమ్మప్ప, టీడీపీ సీనియర్ నాయకులు బసాపురం రామస్వామి, లక్ష్మీనారాయణ, జయరాం, కార్మిక వెంకటేష్, రవి, సెలక్షన్ కమిటీ సభ్యులు నారాయణరావు, హరిబాబు, టెక్నికల్ కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రస్థాయి సెలక్షన్ అధికారులు పాల్గొన్నారు. అలాగే 28 జిల్లాల నుంచి వచ్చిన పీఈటీ ఉపాధ్యాయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వెంకటేష్ చౌదరి, వినయ్, లోకేష్, ఎరుకుల హనుమంతు, రఘు, ఏనుగుల వెంకట్రాము, వంశీ నాయుడు, పీఈటీలు ఓబన్న, రవి, శివ, చెన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటుండగా, ఆదోనిలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

