మీ నమ్మకమే నా విజయం.. మీ సేవే నా లక్ష్యం: ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి శెట్టి నాగేష్- ఆర్.వి. నగర్ (జీకే వీధి)
"ప్రజల నమ్మకమే నా విజయానికి పునాది.. ప్రజా సేవే నా తుది శ్వాస వరకు లక్ష్యం" అని జీకే వీధి-3, ఆర్.వి. నగర్ ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి శెట్టి నాగేష్ స్పష్టం చేశారు. స్థానిక గ్రామ పరిధిలో ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించి, ఓటర్లను కలిసి మద్దతు కోరారు.
ఈ సందర్భంగా శెట్టి నాగేష్ మాట్లాడుతూ.. జీకే వీధి-3 ప్రాంత సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. స్థానికులు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాను పదవుల కోసం కాకుండా, నిరంతరం ప్రజల మధ్య ఉండే ఒక సామాన్య సేవకుడిగా పనిచేయడానికే బరిలోకి దిగానని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి సాధ్యం కావాలంటే నిస్వార్థ ప్రజాసేవకుడికి అవకాశం ఇవ్వాలని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తనకు సహకరించి ఆశీర్వదించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.


