కూటమి రెండేళ్ల పాలన స్వర్ణయుగం

కూటమి రెండేళ్ల పాలన స్వర్ణయుగం: టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్



ఆదోని: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టించిందని టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ కొనియాడారు. మంగళవారం ఆదోనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వినూత్న సంక్షేమ పథకాలు, సంస్కరణలను అమలు చేసిన ఘనత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.

అమలవుతున్న సంక్షేమ పథకాలు:

 తల్లికి వందనం: ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం

 దీపం పథకం: పేద మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు

 పెన్షన్ల పెంపు: వృద్ధులకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000

 మత్స్యకారులకు భరోసా: వేట నిషేధ భృతి రూ. 20,000

 ఆలయ అర్చకులు & ఇమామ్-మౌజన్లు: నెలకు రూ. 15,000 గౌరవ వేతనం

 నాయీ బ్రాహ్మణులు: రూ. 25,000 గౌరవ వేతనం

 ఆదరణ పథకం: బీసీ కార్మికులకు ఆధునిక పనిముట్ల కోసం రూ. 1,000 కోట్లు

 ఎస్సీ సంక్షేమం: సాధికారతకు రూ. 30,041 కోట్లు

 మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మరియు అన్నదాత సుఖీభవ పథకం అమలు

 గత ప్రభుత్వ బకాయిల చెల్లింపులు:

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పెండింగ్‌లో పెట్టిన వేలాది కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా చెల్లించిందని ఫక్రుద్దీన్ స్పష్టం చేశారు.

 రైతు సంక్షేమం: ధాన్యం బకాయిలు రూ. 1,674 కోట్లు, మైక్రో ఇరిగేషన్ రూ. 1,166 కోట్లు, విత్తన రాయితీ రూ. 220 కోట్లు, ఆయిల్ పామ్ రైతులకు రూ. 239 కోట్లు, పంట నష్టపరిహారం రూ. 119 కోట్లు

 పోలవరం & రాజధాని: పోలవరం నిర్వాసితులకు రూ. 997 కోట్లు, రాజధాని రైతుల కౌలు రూ. 400 కోట్లు, అమరావతి-గన్నవరం ఎయిర్‌పోర్టు భూముల పరిహారం రూ. 2,044 కోట్లు

 ఉద్యోగుల సంక్షేమం: ఉద్యోగుల జీపీఎస్/సీపీఎస్ బకాయిలు రూ. 8,000 కోట్లు, సీపీఎస్ అదనపు చెల్లింపులు రూ. 2,600 కోట్లు, ఏపీజీఎల్ఐ రూ. 1,000 కోట్లు, పోలీసు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రూ. 214 కోట్లు, వివిధ శాఖల ఉద్యోగుల పెండింగ్ జీతాలు రూ. 366 కోట్లు

 విద్యారంగం: ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 2,832 కోట్లు, వసతి దీవెన రూ. 989 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌‌లు రూ. 788 కోట్లు, పీజీ విద్యార్థుల బకాయిలు రూ. 450 కోట్లు, ఎన్టీఆర్ విదేశీ విద్యా నిధులు రూ. 33 కోట్లు, పాఠశాలల్లో ఆయాలు/వాచ్‌మెన్ల వేతనాలు రూ. 352 కోట్లు

 వైద్యం & మౌలిక వసతులు: ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) రూ. 4,300 కోట్లు, డ్రగ్స్ & మెడిసిన్స్ బకాయిలు రూ. 100 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ. 3,100 కోట్లు, రూ. 10 లక్షల లోపు చిన్న కాంట్రాక్టర్లకు రూ. 506 కోట్లు

రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వ విజయాలను ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని గడ్డా ఫక్రుద్దీన్ పిలుపునిచ్చారు.