రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి కు శుభాకాంక్షలు తెలిపిన కొండి శెట్టి సురేష్ బాబు
విజయవాడ జన సేన ప్రతినిధి ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెడదాం.
- ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేద్దాం.
- రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి దేశంలోనే అగ్ర గామీ రాష్ట్రంగా నిలపాలన్న ముఖ్య మంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నియమితులైన కొలుసు పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ఏపీ స్టేట్ బ్యూరో కొండి శెట్టి సురేష్ బాబు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి వంటి సమాచార, పౌర సంబంధాల శాఖ పనితీరు ఎంతో కీలకమైందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయడంలో వినూత్న విధానాలను అవలంబించాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం అమలుచేస్తున్న విధానాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని భిన్న ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలమైనప్పుడు, వాటిని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రి కొలుసు పార్థసారథి మంత్రిని కలిసి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. ఏపీ స్టేట్ బ్యూరో ఏ జనసేన కొండిశెట్టి సురేష్ బాబు, అన్నదేవర జనసేన ఎడిటర్ డాక్టర్ అన్నదేవర సత్యనారాయణమూర్తి మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.