నిరుపేద విద్యార్థి చదువుకు బుక్స్ యూనిఫారం వితరణ

నిరుపేద విద్యార్థి చదువుకు బుక్స్ యూనిఫారం వితరణ చేసిన డాక్టర్ కేజే నాయుడు



       అగనంపూడి సెక్టర్ 3 దిబ్బపాలెం లో స్టార్ డం పాఠశాలలో స్థానికంగా ఉన్న కర్రి రమేష్ సుమారు మూడు సంవత్సరాల నుండి బ్రెయిన్ స్ట్రోక్ అనారోగ్యంతో ఏ పని చేయకుండా ఇంటిదగ్గర ఉంటున్నారు ఆయన కుమార్తె కర్రీ కీర్తి కి ఎల్ కే జి చదవడానికి డాక్టర్ కేజే నాయుడు ఆర్థిక సహాయంతో బుక్స్ స్కూల్ యూనిఫారం ను ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ చేతుల మీదగా పాప అమ్మ శ్రీమతి కర్రీ స్వాతికి అందజేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ కుమార్తెకు సహకారం అందించిన డాక్టర్ కేజే నాయడు ని స్థానిక పెద్దల అభ్యర్థన మేరకు ఆ పాపకి స్కూల్ ఫీజు లేకుండా ఫ్రీ అడ్మిషన్ ఇచ్చిన స్టార్ డం స్కూల్ యాజమాన్యాన్నిఅభినందించారు. స్టీల్ ప్లాంట్ విశ్రాంతి ఉద్యోగి బోండా ఈశ్వరరావు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్టార్ డం స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ డిఎస్పి వర్ధని అకౌంటెంట్ పి వి రాఘవరావు సర్వహిత చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గుదే గజేంద్రరావు విశాఖ జిల్లా లైన్స్ క్లబ్ చైర్పర్సన్ కడీమి హనుమంతరావు స్థానిక విజన్ కేర్ అధినేత రవికుమార్ పాల్గొన్నారు.