టిడిపి రాష్ట్ర నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఆ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నందున CM చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారుని ఆయనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గాజువాక MLAగా పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో విజయం సాధించారు.