షెడ్యుల్డ్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం రూపకల్పనకు చర్యలు చేపట్టాలి...
మెగా డీఎస్సీ రెండు వేలు ఇరవై నాలుగు లో ఏజెన్సీ పోస్టులు స్థానిక ఎస్టీ అభ్యర్ధులతోనే భర్తీ చేయాలి, సి. ఎ .మ్ .చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్ లకు లేఖలు రాసిన ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఎ సి అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ రామారావు దొర.
ఏజెన్సీ ప్రాంతాలకు ఉపాద్యాయ మరియు ఇతర ఉద్యోగాల నియామకాలలో స్థానిక ఎస్టీ అభ్యర్ధులతో భర్తీ చేయుటకు షెడ్యుల్డ్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం రూపకల్పనకు చర్యలు చేపట్టాలని మెగా డి ఎ స్సి, రెండు వేలు ఇరవై నాలుగు ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలో భర్తీ చేయనున్న ఉపాద్యాయ పోస్టులను స్థానిక ఎస్టీ అభ్యర్ధులతోనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి లేఖలు రాసినట్టు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఎ సి అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా కన్వీనర్ రామారావు దొర మీడియాకు తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నంబర్ త్రీ ద్వారా ఏజెన్సీలో స్థానిక షెడ్యుల్డ్ తెగల అభ్యర్ధులతో ఉపాద్యాయ నియామకాలు చేపట్టారని రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండువందల నలబై నాలుగు ఒక పేరా ఐదు ఒకటి చెప్పిన విధంగా చట్టాలలో మార్పులు చేయలేదనే సాంకేతిక కారణంతో సుప్రీం కోర్ట్ ఆ జీవోను కొట్టివేసిందని అన్నారు. భారత రాజ్యాగంలో పార్ట్ పది షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఐదు వ షెడ్యూల్డ్ ప్రాంతాలు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని ఎస్టి శాసన పార్లమెంటు సభ్యులు చొరవ తీసుకుని ఆదివాసులకు మేలు జరిగేవిధంగా అవగాహనతో కృషి చేయాలనీ కోరారు.
షెడ్యూల్డ్ ఏరియా ట్రైబల్స్ సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు టి ఎ సి ద్వారా అవసరమైన తీర్మానాలు చేసుకునే వెసులుబాటు ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిందని ఆదిమజాతుల వారికి మేలు చేయడానికి పార్లమెంట్ చట్టాలను రాష్ట్ర శాసన సభ చట్టాలను తగిన మార్పులు చేర్పులతో గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా వర్తింపజే అవకాశం ఉందని రామారావు దొర మీడియాకు వివరించారు. ఐదు వ షెడ్యూల్డ్ లోని పేరా ఐదు ఒక నియమాలననుసరించి రాష్ట్ర గవర్నర్ జారి చేసిన జివో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టివేసిందని, అయితే పేరా ఐదు రెండు ప్రకారం గవర్నర్ నోటిఫికేషన్ పై రాష్ట్రపతి ఆమోదంతో రెగ్యులేషన్ చట్టం చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఐదు వ షెడ్యుల్ ప్రాంతంలో ఉద్యోగాలు మరియు ఉపాధ్యాయ పోస్ట్ లు భర్తీ గురించి జాతీయ విధానం రూపొందించబడిందని, షెడ్యుల్ ఏరియలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి గవర్నర్ గారు నిర్ణయం తీసుకొనుటకు టి ఎ సి తీర్మానం కోరుతూ లేఖ పంపిన ఈ విషయం నేటివకు టి ఎ సి వద్ద పెండింగ్ లో ఉందన్నారు. ప్రభుత్వం త్వరిత గతిన టి ఎ సి ని ఏర్పాటు చేయించి తీర్మానాన్ని గవర్నర్ గారికి పంపించి ఏజెన్సీ ప్రాంతానికి అవసరమైన చట్టాలలో మార్పులు తీసుకురావాలని, ఉపాద్యాయ మరియు ఇతర ఉద్యోగాలలో స్థానిక ఎస్టీ అభ్యర్ధులతో భర్తీకి షెడ్యుల్డ్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం రూపొందించుటకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు. అలాగే ఎన్నికల హమిలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి లో ఏజెన్సీ ఏరియా పోస్టులను స్థానిక ఎస్టి అభ్యర్డులతో భర్తీ చేయడం లేదా ఎజేన్సికి ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎస్టి అభ్యర్ధులతో భర్తీ చేసే విధంగా తగు చర్యలు తీసుకొవాలని కోరారు.