అల్లూరి జిల్లా జి కె వీధి మండలం పరిధి లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే జీకే వీధి మండలం మొండిగడ్డ గ్రామ పరిధిలో ఉదయం 9:30 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. వెంటనే స్థానికులు స్పందించి గాయాల పాలైన వారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించగా వంతల కొండబాబు అనే వ్యక్తి మార్గ మద్యం లో మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనకు కు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.