వేపచెట్టు ఇంటి మీద పడి ఇల్లు ధ్వంసం

తృటిలో తప్పిన పెను ప్రమాదం ఒక భారీ వేపచెట్టు ఇంటి మీద పడి ఇల్లు ధ్వంసం



అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్త వీధి మండలం, సీలేరు గ్రామంలో నిన్న సాయంత్రం పెద్ద గాలి వానకి భారీ వేపచెట్టు విరిగి ఒక ఇంటిని ధ్వంసం చేసింది. ఆ సమయంలో  ఆ ఇంటి వద్ద యజమానురాలు,  మరియు పిల్లలు  ఎవరు లేకపోయేసరికి తృటిలో  పెను ప్రమాదం తప్పిందని, ఆ ఇంటి యజమాని అయిన కొర్రా రాజేంద్ర తెలిపారు. తాను ఒక నిరుపేద గిరిజన వ్యక్తినని, కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నానని, తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, నాకు న్యాయం చేయగలరని ఆయన తెలిపారు.