ప్రజలంతా డిపాజిట్ ఖతాల గురించి తెలుసుకోవాలి, ఆన్‌లైన్ మోసాలు మరియు సైబర్ నేరాల పై జాగ్రత్తగా ఉండాలని విశాఖపట్నం ఎల్.డి.ఎం, ఎం.శ్రీనువాస్ గారు అన్నారు. 20వ తేదిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఆటోనగర్, గాజువాక నందు జరిగిన రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథి గా పాల్గోని ప్రసంగించారు. ఈ వర్క్ షాప్, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అధ్వర్యములో, ప్రాజెక్టు డైరెక్టర్ వి.ఆంజనేయులు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్ పర్యవేక్షణ లో నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎల్.డి.ఎం ఎం.శ్రీనువాస్ గారు, కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ రవికుమార్ గారు , ఐ.ఓ.బి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ టి. డి.నాయుడు అతిథి లుగా పాల్గోని ప్రసంగించారు. “ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్యాంకింగ్ ఫోల్డర్‌లో చేర్చబడాలి, ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి, బ్యాంకు ఉత్పత్తులను ఉపయోగించాలి మరియు బ్యాంకింగ్ సేవలను తెలివిగా ఉపయోగించాలి” అని తెలియజేసారు. ఈ వర్క్ షాప్ లో రిసోర్స్ పర్సన్ ఎస్.బాలకృష్ణ గారు ,ట్రైనర్లు పి.దీపక్ గారు , ఎస్.అల్యాణ గారు ఈ క్రింద విషయాలపై డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ నేరాలు, బ్యాంక్ ఖాతాలు, సామాజిక భద్రత పదకాలు గురించి అవగాహన కల్పించారు.