మంత్రి పార్థసారథి ని కలిసిన మీడియా ప్రతినిధులు...



సమాచార, పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి ని బుధవారం ఉదయం విజయవాడలోని వారి నివాసంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఎపిఎంఎఫ్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి. ఢిల్లీబాబు రెడ్డి ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు కలిసి సన్మానించారు. 



ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ప్రభుత్వం పరంగా చేపట్టవలసిన చర్యలపై ఢిల్లీబాబు రెడ్డి మంత్రి పార్ధసారధి తో చర్చించారు. ఆయా సమస్యల పరిష్కారం పట్ల మంత్రి  పార్ధసారధి సానుకూలంగా స్పందించారు. 



ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్, ఎపిఎంఎఫ్ నాయకులు ఐ. వెంకటరామరాజు, పీతల అప్పాజీ, టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.