ప్రపంచ (జాతీయ) సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ సందర్భంగా తేది: 19/06/2024 బుధవారం సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మస్తాన్ వల్లి ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో, అంగన్వాడి ఆరోగ్య కార్యకర్తలతో, ప్రజా ప్రతినిధులతో స్థానిక కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా ర్యాలీ( world sickle cell awareness really) నిర్వహించడమైనది.
సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ర్యాలీ ప్రారంభమై సీలేరు ప్రధాన కూడళ్లలో మానవహారం నిర్వహించారు. స్థానిక వైద్య వైద్యాధికారి మాట్లాడుతూ,
1, సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ కోసం రక్తపరీక్ష చేయించుకోవాలని నిర్ధారణ అయితే వైద్యుని యొక్క సూచనలు సలహాలు చికిత్సలు తీసుకోవాలని తెలియజేశారు.
2, బిపి షుగర్ లాగా ఇది సాధారణమైన వ్యాధిని అపోహలతో భయపడవద్దని తెలియజేశారు
3, మేనరికం పెళ్లిళ్ల వల్ల ఈ వ్యాధి రావచ్చని మేనరికం పెళ్లిళ్లు చేసుకోవద్దని తెలియజేశారు
4, పౌష్టికాహారం బాగా తీసుకోవడం వలన ఈ వ్యాధిని నియత్రణ లో ఉంచ్చ వచ్చని తెలియజేశారు
5, ఇది వంశపారం పర్యంగా వచ్చి వ్యాధిని వ్యాధి ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలియజేశారు
6, ఈ వ్యాధి సోకిన వ్యక్తి కళ్ళు పసుపు రంగులో ఉంటాయి, ఒంట్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది మోచేతులు మోకాళ్ళకు వాపులు వస్తాయి, తరచుగా జ్వరం వస్తుంది ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సూచనలు సలహాలు చికిత్స పొందాలని తెలియజేశారు.
మరియు ఈ సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ అయి వ్యాధి శాతం ఎక్కువగా ఉంటే ప్రభుత్వం ద్వారా 10,000 రూపాయలు ప్రతినెల పెన్షన్ ఇస్తారని తెలియజేశారు. మున్నగు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక వైద్యాధికారి మస్తాన్ వల్లి, దేవసేన ఎంపీటీసీ పిల్లా.సాంబమూర్తి సర్పంచ్ పాంగి. దుర్జో, ఆరోగ్య పర్యాయవేక్షకులు ఎన్.త్రినాధరావు, బాలామణి, ఏఎన్ఎం దేవి, హెల్త్ అసిస్టెంట్, సత్యనారాయణ, అంబులెన్స్ డ్రైవర్ జీవన్ కుమార్ ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు ప్రజలలో సికిల్ సెల్ అనిమియ వ్యాధి పై అవగాహన కల్పిస్తున్న సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి మరియు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, Z.P.H.స్కూల్ సిబ్బంది, GTW (గర్ల్స్) స్కూల్ సిబ్బంది, గవర్నమెంట్ జూనియర్ కాలేజి సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించడం జరిగినది. అనంతరం వైద్య సిబ్బంది బృందాలు గా వెళ్లి ఇంటింటికీ సికిల్ సేల్ అనీమియా పరీక్షలు నిర్వహించడం జరిగినది. పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.