విశాఖ జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి అప్పలరాజు (54)ఈ రోజు అనారోగ్యంతో 17 న సాయంత్రం 7 గంటలకు అకాల మరణం చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శులకు సభ్యులు కే లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్, బి జగన్, పి మణి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజయ్ శర్మ, మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ, వై రాజు, ఎం సుబ్బారావు సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పాల్గొని అప్పలరాజు పార్ధవదేహానికి నివాళులర్పించారు. అనంతరం జగదాంబ జోన్ పార్టీ కార్యదర్శి ఎం సుబ్బారావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ జగదాంబ ఏరియా 32వ వార్డు కృష్ణా గార్డెన్ లో ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
గత 25ఏళ్లుగా సీఐటీయూ, సిపిఎం పార్టీ సభ్యుడుగా పార్టీఅభివృదికి ఎంతో కృషి చేశారు. డి వై ఎఫ్ ఐ లో పనిచేస్తూ అనేక మంది యువకులను పార్టీలోకి తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్ ను విస్తరించటానికి ఎనలేని కృషి చేశారు. వీరి భార్య వరుణ మహిళా సంఘం లో పనిచేసారు. తమ్ముడు గణేష్ ప్రస్తుతం అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీ వై ఎఫ్ ఐ) విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడుగా, జగదాంబ జోన్ పార్టీ కమిటీ సభ్యు డు గా ఉన్నారు. అప్పలరాజు మృతి ఆటో కార్మికులకే కాకుండా మొత్తం కార్మిక వర్గానికి, పీడిత ప్రజానీకానికి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.