అల్లూరి సీతారామ జిల్లా: బైక్ టిప్పర్ లారీ ఢీ..ఇద్దరికీ తీవ్ర గాయాలు..
అల్లూరి జిల్లా అరకులోయ మండలంలోని మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం అరకులోయ వైపు నుంచి ఇద్దరు యువకులు రైల్వేలో కూలి పనుల కోసం బైక్పై లోతేరు వైపు వెళ్తుండగా లోతేరు వైపు నుంచి వస్తున్న టిప్పర్ లారీ బట్టివలస సమీపంలోని మలుపు వద్ద ఎదురెదురుగా బైక్ లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కలకత్తాకి చెందిన ఉత్తమ్ తోపాటు ఒడిశా బెజకి చెందిన హిరోన్ కి తీవ్ర గాయాలు కాగా వారిని 108లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న కలకత్తాకు చెందిన యువకుడికి విశాఖ కేజిహెచ్ కు తరలించినట్లు తెలిపారు.