గుర్తు తెలియని మృతదేహం... ఇంకా వివరాలు నిర్ధారణ కాలేదు... ఎన్నో అనుమానాలు... మరెన్నో సందేహాలు...?
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం, మంప పోలీస్ స్టేషన్ దగ్గర్లో జరిగిన సంఘటన, ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలే తప్పా, ఆ గుర్తుతెలియని మృతదేహం ఎవరిదో? ఏమిటో? ఇంకా వివరాలు నిర్ధారణ కాలేదు.
ఈనెల 15న మండల కేంద్రంలోని కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఐటీడీఏ కాలనీ సమీపంగా, వట్టి కాలువ ఒడ్డున, ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి దేహం ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది .ఈ సంఘటన పై కేసు నమోదు చేసిన కొయ్యూరు పోలీస్లు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహం బాగా కుళ్లిపోయు ఉండడంతో అప్పటికే సంఘటన జరిగి సుమారు ఐదు రోజుల అయి ఉంటుందని కొయ్యూరు ఎస్సై రామకృష్ణ అంచనా వేశారు. ఇది ఆత్మహత్య అయి ఉంటుందని పోలీసులు, ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ తీరుతేన్నులను బట్టి పలు అనుమానాలు,పలు సందేహాలు. మృతదేహం మెడకు ఇనుప ముళ్ళ తీగ ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడే వారు. ముళ్ళ తీగను ఎంపిక చేసుకోరంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భంగిమ కూడా పలు సందేహాలకు తావ్విస్తుంది. చంప బడిన వ్యక్తిని వేలాడదీశారా? అన్న అనుమానం రాక మానదు. అలాగే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడానికి, ప్రాణం పోయే ముందు, చెప్పులు కింద చిందరవందరుగా, పడే అవకాశం ఉంది. అయితే అక్కడ చెప్పులు మాత్రం మృతదేహానికి కాళ్ల వద్ద చక్కగా సర్దినట్లుగా ఉండటం. మరిన్ని అనుమానాలకు తావ్విస్తుంది. ఏది ఏమైనా ఆ వ్యక్తి ఎవరా...ఆనేది బయటపడితే గాని అది హత్య? లేక ఆత్మహత్య? అనే విషయం నిర్ధారణ కాదు. కాగా పోలీసులు మాత్రం ఆ వ్యక్తిని గుర్తించేందుకు, విచారణ నిర్వహిస్తున్నారు. అయితే, బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర ఇన్చార్జి గోవింద్ ఈ విషయంపై కొయ్యూరు ఎస్సై రామకృష్ణ తో మాట్లాడుతూ అది అత్య? లేదా ఆత్మహత్య? ఏం జరిగింది అనేది విచారణ జరిపి కొయ్యూరు మండల విలేకర్ చల్లంగి వినోద్ కు తెలియజేయాలని కోరారు. కొయ్యూరు ఎస్సై రామకృష్ణ విచారణ జరుగుతుందని, అన్ని కోణాలలో దర్యాప్తు నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలు సేకరించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తెలియజేస్తామని అన్నారు.