అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జమేధారుబంజర్, గురవయిగూడెం గ్రామాలలో లో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది.
అనంతరం జరిన జనరల్ బాడీ లో అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘo జిల్లా కార్యదర్శి అమర్లపూడి రాము, సిపిఐ, మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ నూపా భాస్కర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం వ్యవసాయ కార్మికులకు నెలకు 12 వేల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసినారు.కానీ ఈరోజు వరకు కూడా వ్యవసాయ కార్మికులకు అన్న ప్రకారం ఇవ్వలేదు.
రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు వ్యవసాయ మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు కానీ జీవన భృతి ఇవ్వలేకపోవడంతో కార్మికులు వలస వెళ్తున్నారు అక్కడకు వెళ్లి అడ్డా కూలీలుగా మారి జీవితం దుర్భరంగా గడుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ కూలీలకు 12,000 జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదు ఎకరానికి 15000 రైతు భరోసా ఇస్తానని ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అందుకు వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అఖిలభారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది.లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తుంది.ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు కురసం ముత్యాలరావు, తమా రాముడు, పండూరి వీరబాబు, ఊకె మహేష్, కుంజా కాంతారవు, కొరస శ్రీను, తాటి ముత్యాలరావు,గడ్డం పుష్ప, తాటి రాఘవమ్మ, కిసరి కమల తదితరులు పాల్గొన్నారు.