ఊట్లపల్లి గ్రామంలో ఘనంగా కార్తీక మాస వన సమారాధన.....

ఊట్లపల్లి గ్రామంలో ఘనంగా కార్తీక మాస వన సమారాధన.....భక్తులతో కిటకిటలాడిన అంకమ్మ తల్లి చెరువుగట్టు.



శ్రీశ్రీ భక్తాంజనేయ స్వామినీ దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు...



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా., అశ్వరావుపేట మండలం., ఊట్లపల్ల గ్రామంలో అంకమ్మ చెరువు గట్టు పైన వెలసియున్న స్వయంభు శ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం నాడు అందులోను కార్తీకమాసం మూడవ వారం కావడంతో శ్రీశ్రీ భక్తాంజనేయ స్వామినీ దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచి వేల సంఖ్యలో రావడం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మహిపాల్ (నాయన) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తీక మాస వనసమారాధన మహోత్సవంలో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి అంకిత మల్లికార్జున్ రావు, జూపల్లి రమణారావు, మాజీ సర్పంచ్ పొట్ట రాజులు, మరియు పద్మ తదితరులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు