అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో రాజ్య స్థరీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శన( వైజ్ఞానిక సదస్సు ) సోమవారం స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైనది.
ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిధిగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జగపతి రాజు, వరంగల్ నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారిని స్వరూపారాణి మరికొందరు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును ప్రారంభించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో పలు పాఠశాలల నుంచి విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు.