హలో శుభోదయం...దమ్మపేట మండలం రాచూరుపల్లి, మల్కారం పంచాయతీలలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ..
హలో శుభోదయం కార్యక్రమం నిర్వహించి విస్తృతంగా పర్యటించి ప్రతివీధి తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలు స్వయంగా గమనిస్తూ పరిస్కారం అయ్యో సమస్యలు వెంటనే పరిస్కారించాలని అధికారులను చరవాణిలో ఆదేశించారు.
అలాగే గ్రామస్తులను పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. రాచూరుపల్లి గ్రామంలో గతంలో ప్రమాదవశాత్తు క్రీడాకారుడు కోర్స నాగరాజు గారు కాలు కోల్పోగా నాలుగు లక్షలు విలువైన రోబోటిక్ కృత్రిమకాలు ఏర్పాటు చేపించి గతవారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అమర్చేలా కృషిచేసారు. ఈ రోజు నాగరాజు గారి ఇంటికి వెళ్లిన సందర్భంలో కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ నాగరాజు కు భవిష్యత్లో అండగా నిలబడతానన్నారు గతంలోలాగా యదాతదంగా ఆటల్లో పాల్గొనటానికి అండగా ఉంటానన్నారు. జాతీయ స్థాయిలో ఆడటానికి తోడ్పాటు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండలం కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు...