శ్రీ భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరులు రామకృష్ణ రెడ్డి...
పొట్టేళ్ల పోటీలలో మొదటి బహుమతి గెలిచిన పొట్టెళ్ల యజమానికి 20,000 రూపాయలు బహుమతి అందించిన టిడిపి యువ నాయకులు ఎన్.రామకృష్ణ రెడ్డి...
మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబుర్ టౌన్ లోని ఈరోజు కురుబల ఆరాధ్యా దైవమైన శ్రీ భక్త కనకదసు జయంతి శుభ కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎన్.రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఘనంగా నిర్వహించిన పొట్టేలు పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న పొట్టేలు యజమానికి 20వేల రూపాయలు మొదటి బహుమతి అందజేయడం జరిగింది. ఎన్.రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాసు గొప్ప భక్తి ప్రదాత అంటూ, ఆయన కీర్తనలు పాటలను స్మరించుకుంటూ ఆయన జయంతిని పండుగ వాతావరణంల జరుపుకుంటున్న కురుబ సోదర సోదరీమణులకు భక్త కనకదాసు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురుబ మల్లికార్జున, వీరేష్ గౌడ్, మీసేవ ఆంజనేయ, కోడిగుడ్ల ఏసేపు, రామాంజులు, వెంకటేశులు, తలారి ఆంజనేయ, మాలపల్లి లక్ష్మన్న మరియు కురుబ సోదరులు, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.