APVBS ఆధ్వర్యంలో బోయ వాల్మీకి కార్తికమాస వనభోజన మహా ఉత్సవం

హాలహర్వి మండలం ఆలూరు నియోజకవర్గ శ్రీ బెళ్ళుగుండు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ  సంఘం (APVBS) ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జరిగే బోయ వాల్మీకి కార్తికమాస వనభోజన మహా ఉత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 



హాలహర్వి మండలం స్థానిక  శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహా  నందు బోయ వాల్మీకి కార్తీక మాస వనభోజన మహోత్సవ ఆహ్వానం కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. 



ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో బోయ వాల్మీకి కార్తీకమాస వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హాలహర్వి మండల చుట్టుపక్కల గ్రామాల్లో బోయ వాల్మీకి పెద్దలు యువకులు మహిళలు అందరు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో APVBS ఆలూరు నియోజకవర్గం అధ్యక్షులు డి.నాగేష్, హాలహర్వి మండల అధ్యక్షుడు  డా.నరసప్ప,వాల్మీకి సీనియర్ నాయకులు అర్ధగేరి శీనప్ప, ఆలూరు నియోజకవర్గం యూత్ వింగ్ అధ్యక్షుడు హుళేబీడు వీరేష్, యువనాయకులు గోపాల్, గాదెయ్య మరియు తదితర వాల్మీకి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.