విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీలు దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీలు దగ్ధం...ఆదుకున్న BRS నాయకులు.



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలో రెండు రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీలు దగ్ధం అయ్యి నిర్వాసితులైన బాధితులు పింగుల రాము కుటుంబాన్ని ఆదుకున్న BRS నాయకులు. 



బాధితుల కుటుంబానికి నిత్యవసర సరుకులు అయిన 2 బాగ్స్ బియ్యం, వంట సామాగ్రి, బట్టలు, దుప్పట్లు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి డబల్ బెడ్ రూమ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిర్రం వెంకటేశ్వరరావు, కాసాని చంద్ర మోహన్, లోకం సాంబశివరావు,బినల్లపు రామారావు, ఉప్పల ప్రసాద్, ఉప్పల మురళీ, ముస్తఫా డాక్టర్, బయ్య సత్యనారాయణ, దిడ్డి వీరబాబు, అచ్చే నాగేంద్రరావు, తల్లాడ వెంకటేశ్వరరావు, sk అటావల్ల, పాయం దుర్గారావు పాల్గొన్నారు.