కాలేజీ విద్యార్థులు రోడ్డు రవాణా సమస్యలను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ విజయనగరం జోన్_ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయకుమార్ మరియు డిపో మేనేజర్ డీ యం సుధాకర్ , జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు దృష్టికి తీసుకువెళ్లిన పశ్చిమ నియోజకవర్గం యువత అధ్యక్షుడు మధుబాబు...
కాలేజీ విద్యార్థులు రోజు ఎదుర్కుంటున్న రోడ్డు రవాణా సమస్యలను గురించి వాళ్ళకి ఎదురవుతున్న ప్రమాదాల గురించి విద్యార్థుల కాలేజీ ప్రయాణానికి కావాల్సిన అవసరతల గురించి విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత విద్యార్థులు పశ్చిమ నియోజకవర్గం యువత అధ్యక్షుడు మధుబాబు కి తెలియజేశారు.
మధుబాబు తక్షణమే స్పందించి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయకుమార్ మరియు డిపో మేనేజర్ డీ యం సుధాకర్, జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అదనపు బస్సుల ఏర్పాటు గురించి కాలేజీ సమయాలలో ప్రత్యేక దారులను వెయ్యడం గురించి మరియు పెద్ద బస్సులను కాలేజీ సమయాలలో తిప్పడం గురించి మధుబాబు మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ కుమార్ మరియు డిపో మేనేజర్ డీ యం సుధాకర్, జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మధుబాబు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధం గా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుబాబు తో పాటుగా వెంకటేష్, సత్య, జీవన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.