ఘనంగా మంత్రి తుమ్మల పుట్టినరోజు వేడుకలు



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల నియోజకవర్గంలో వినాయకపురం  గ్రామంలో మంత్రి తుమ్మల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి తుమ్మల పుట్టినరోజు వేడుకలలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వినాయకపురం పార్టీ కార్యకర్తలు.



ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలలో మంత్రిగా బాధ్యతలు వహిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కంటి రెప్పల కాపాడుకుంటూ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా మా వినాయకపురం గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నామని ఆ దేవుడు ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరి ప్రార్థిస్తున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కుర్రం సింహాచలం, వేల్పుల నాగమహేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ లీడర్ శివరాశి వెంకన్న బాబు, కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు పోలిశెట్టి కృష్ణకుమారి‌, పోలిశెట్టి విశ్వేశ్వరరావు కొవ్వాసి హరిబాబు. పూనెం ముత్యాలరావు, కొవ్వాసి దుర్గారావు, ఎస్ కే జిలాని, లక్ష్మీనారాయణ చారి, ఆళ్ల రమేష్, భోగి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.