పల్లెల్లో అభివృద్ధి పనులు శరవేగంగా

40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులను ప్రారంభించిన మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారి సోదరుడు రఘునాథ్ రెడ్డి...

మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి సహకారంతో పల్లెల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి... మాధవరం మాజీ సర్పంచ్ ఎన్. రఘునాథ్ రెడ్డి...



మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో 40 లక్షల రూపాయల నిధులు మంజూరైన సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టిన మాధవరం మాజీ సర్పంచ్ ఎన్.రఘునాథ్ రెడ్డి. అనంతరం రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి సహకారంతో మన మంత్రాలయం పల్లెల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అలాగే కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత వైసీపీ హయంలో గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి లేక ఎన్నో ఇబ్బందులు పడిన ప్రజలు ఈ అభివృద్ధి పనులు చూసి సంతోషం వ్యక్తం చేస్తురన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందిరమ్మ, ఉరుకుందు భీమారెడ్డి, నాగరాజు, సిద్ధయ్య,  ఈరన్న, ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.